జీవశాస్త్రాల ఆధునిక పురోగతుల అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు కళాశాల సెమినార్ హాల్‌లో ఘనంగా ప్రారంభమైందని ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి తెలిపారు.
ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విశాఖపట్నం అపోలో హెల్త్ సిటీ యూనిట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ మరియు స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్, డా. సుమన్ దాస్ దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన చుట్టూ ఉన్న పర్యావరణం, వివిధ రకాల పర్యావరణ ప్రభావాలు మానవ ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు., మానవ జీవశాస్త్రం, వ్యాధుల మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు
ప్యాట్రన్, వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ హేమ బయోకెమిస్ట్రీ విభాగాన్ని, నిర్వాహక బృందాన్ని అభినందించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పర్యావరణ సమస్యలు మానవ ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత సమకాలీనమైన అంశాన్ని సదస్సుకు ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య అర్థవంతమైన శాస్త్రీయ చర్చలకు, అంతర్‌శాఖల పరస్పర మార్పిడికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని వారు ఆకాంక్షించారు.గౌరవ అతిథులుగా డా. షీతల్ మదన్,, క్యాన్సర్ రోగుల చికిత్స నిపుణులు, రషీ హోమియో క్లినిక్, విశాఖపట్నం, డా. కె. మాణిక్య కుమారి, మాజీ విభాగాధిపతి, వృక్షశాస్త్ర విభాగం, సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల పాల్గొన్నారు.సదస్సు కన్వీనర్, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డా. పి. మేరీ అనుపమ మాట్లాడుతూ, శాస్త్రీయ పురోగతిని వాస్తవ ప్రపంచంలోని పర్యావరణ, ఆరోగ్య సమస్యలతో అనుసంధానించడం, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను స్థిరమైన పరిష్కారాల దిశగా ప్రేరేపించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కో-కన్వీనర్ డా. మౌసమి శంకర్ మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేశారు.IQAC కోఆర్డినేటర్ డా. టి. భాస్కర సుధ, డా. హరిణి, డా. ఎస్. దీప్తి, లక్ష్మీ ప్రసన్న, డా. టోనియా గ్రేస్, డా. కోటేశ్వరరావు, డా. ఆదిత్య దీప్తి, మేరీ విజయ రత్నం తదితరులు, బయోకెమిస్ట్రీ విభాగ విద్యార్థులతో కలిసి సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, మానవ ఆరోగ్యం వంటి ప్రస్తుత ప్రపంచ సమస్యలకు సంబంధించిన అంశాన్ని సదస్సు కోసం ఎంపిక చేయడం అభినందనీయమని తెలిపారు. 150 కి పైగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు ఈ సదస్సు లో పాల్గొన్నారని కన్వీనర్ పేర్కొన్నారు.





0 Comments