విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని- వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థలో శ్రీ వాత్సవ్ తమ సొంత నిధులతో పేదలకు అన్నదానం నిర్వహించారు. సంస్థ బిల్డింగ్ కి పెయింటింగ్ కి కూడా 10,000రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ, మా తండ్రిగారు ద్రోణం రాజు. శ్రీనివాస్ గారికి వివేకనంద సంస్థ అంటే చాలా మక్కువ, ఆయన కూడా సంస్థకి పలు రకాల సేవలు అందించారు, మా తండ్రిగారి బాటలోనే నేను కూడా సంస్థకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. ఎప్పటికప్పుడు సంస్థ నిర్వహిస్తున్న ప్రతి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆర్థిక సహాయం అందిస్తున్న శ్రీవాత్సవ కి సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు.
0 Comments