విశాఖపట్నం -ఈ రోజు అనగా తేది. 10.09.2026 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాల సందర్భంగా మానసిక వైద్య నిపుణులచే సదస్సులు నిర్వహించడం ఆత్మహత్యలు వద్దు - నిండైన జీవితం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ, పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం స్వర్ణ భారతి లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ప్రతిసంవత్సరం సెప్టెంబర10 న జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలను నివారణకోసం ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2003వ సంవత్సరం నుండి ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆత్మహత్యల గురించి నిశ్శబ్దం, కళంకం (Stigma) మరియు అపార్థాలను తొలగించి, బహిరంగంగా మరియు దయతో కూడిన సంభాషణలు జరిగేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ఆత్మహత్యలను నివారించవచ్చని, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇది గుర్తుచేస్తుంది అందరూ మానసిక ఆరోగ్యం మీద అవగాహన కలిగి యుండలి , ర ప్రాంతాలలో మానసిక ఇబ్బందితో ఎవరైనా ఉన్న యెడల వారికి ప్రభుత్వం కలిపించే ఈ మానసిక ఆరోగ్య సేవలును వినుయోగించుకొనెల మీరు ప్రోత్సహించ వాలసినిదిగా కోరుతున్నాము .. ఎవరికి ఎటువంటి మానసిక ఇబ్బందులు ఉన్న, మానసిక భయాందోలనలు ఉన్నా, 14416 /18008914416 ఫొనె నంబర్ కు కాల్ చెసి తగిన సలహాలు మరియు సూచనలు తెలుసుకొనగలరు.ఈ సేవ పూర్తిగా ఉచితం ఈ నెంబర్ కు కాల్ చెస్తే ఉచితంగా సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమానికిప్రోగ్రామ్ ఆఫీసర్ డా.హారిక,మెడికల్ ఆఫీసర్ డా . సిరి మరియు సిబ్బంది పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగినది .
ఈ కార్యక్రమం లో బాగంగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆదేశాలు మేరకు జిల్లాలో ఉన్న వైద్య సిబ్బంది అందరకి గెట్ కీపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది . అలాగే గీతం మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు స్టూడెంట్స్ కి ఆత్మహత్యలనునివారణకోసం అవగాహన కల్పించడం జరిగినది.
జిల్లా వైద్య ఆరోగ్యశాకాధికారి
విశాఖపట్నం.


0 Comments