*శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో సేవా సందడి* *భక్తితో పాటు సేవా స్ఫూర్తి* *ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన* *సేవా కార్యక్రమాలను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌*


విశాఖపట్నం -సెప్టెంబర్‌ 5- స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. మూడో రోజు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుశంకర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులను పరామర్శించారు. పలువురు రోగులకు స్వయంగా కళ్లద్దాలను అందజేశారు. శంకర్‌ ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ రాజును సత్కరించి బహుమతి అందజేశారు. వైద్య సిబ్బందిని అభినందించారు.

ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ సేవలను అభినందించారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ, వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌,

 జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, రౌండ్‌ టేబుల్‌ సంస్థ మాజీ చైర్మన్‌ మక్సూద్‌ అహ్మద్‌, వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments