. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....సముద్రంలో గళ్లంతైనా గంగపుత్రులు రాకతో ఓడలరేవు గ్రామంలో ఆనందోత్సవం కడలికేగిసింది. బెంగాల్ వాసుల ముగ్గురు మా 7గురికి ప్రాణదాతలయ్యారన్నారు. వారి రాకతో కుటుంబ సభ్యులలో ఆనందానికి అవధులులేవు. పశ్చిమ బెంగాల్ నుండి ఓడలరేవు చేరుకున్న ఏడుగురు మత్స్యకారులకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈనెల 3వ తేదీన ఓడలరేవు నుండి సముద్రంలోకి చేపలు వేటకు వెళ్ళి ఆచూకీ లేకుండా పోయిన 7గురు మత్స్యకారులు 23 రోజుల తరువాత క్షేమంగా పశ్చిమ బెంగాల్ లోని దిఘా తీరానికి చేరుకున్నారు.పశ్చిమ బెంగాల్ నుండి వాహనంలో 24 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత మత్స్యకారులు స్వగ్రామం ఓడలరేవుకు చేరుకోగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఆనందంతో వారిని పట్టుకుని కుటుంబ సభ్యులు ఆనంద భాష్పాలు కార్చారు. 7గురు మత్స్యకారులకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ స్వాగతం పలికి వారిని సత్కరించారు. అలాగే సముద్రంలో ఓడల రేవు మత్స్యకారులను రక్షించి తీరానికి తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్ మత్స్యకారులను ఎంపీ హరీష్ మాధుర్ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.తమ వారు సురక్షితంగా ఓడలరేవు చేరుకున్న ఆనందంలో గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.సముద్రంలో చిక్కుకున్న తమ వారిని రక్షించి సురక్షితంగా తీసుకువచ్చిన పశ్చిమబెంగాల్ మత్స్యకార సోదరులకు కుటుంబ సభ్యులు, పలువురు సోదరీమణులు రాఖీ కట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కొల్లు పెద్దిరాజు, మత్స్యశాఖ జేడీ కరుణాకర్, ఆర్డిఓ సరళాదేవి,ఎఫ్ డి ఓ శివరామకృష్ణ, మెరైన్ సిఐ ఎమ్. వి. వి ఎస్.ఎన్.మూర్తి, ఎస్సై సంపత్ కుమార్,మండల రెవెన్యూ అధికారి అడపా సుబ్రహ్మణ్యం, కొల్లు విష్ణుమూర్తి,బిజెపి నాయకులు నల్లా పవన్ కుమార్, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, కంకిపాటి వీరబాబు ,అధిక సంఖ్యలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు




0 Comments