. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు ఎటువంటి అసాంఘిక, ఘర్షణలు ప్రేరేపణ చేసే సందేశాల పట్ల పలు జాగ్రత్తలు వహించాలని అల్లవరం ఎస్.ఐ సంపత్ కుమార్ సూచించారు. అల్లవరo మండల సబ్ ఇన్స్పెక్టర్(SI) సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మండల నాయకులు మరియు సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్ లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియా గ్రూపులకు అడ్మిన్ గా ఉన్న ప్రతి ఒక్కరూ తమ గ్రూపులో అభ్యంతరకర పోస్టులను షేర్ చేసే విధంగా ఉండకుండా తగు జగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల బీజేపీ అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి అంగాని ధనుంజయ వర్మ, జనసేన నాయకులు కంకిపాటి వీరబాబు, సోషల్ మీడియా వారియర్స్ మరియు నాయకులు పోలీస్ సిబ్బంది జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.


0 Comments