విశాఖ జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి* *ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి* *గంట్ల* *డీఆర్‌సీ అనంతరం మూడో అక్రిడేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్*

.          Dr Nanduri Ramakrishna Sr Sub 
విశాఖపట్నం, ఆగస్టు 24 : విశాఖ జిల్లాలో మూడో మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి, జర్నలిస్టుల పెండింగ్ అక్రిడేషన్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ అభిషిక్త్ కిషోర్‌ను జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు *గంట్ల శ్రీనుబాబు* కోరారు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌ను గంట్ల శ్రీనుబాబు కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను  వివరించారు. జిల్లాలో మూడో అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించి, అర్హులైన జర్నలిస్టుల పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన అక్రిడేషన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు, జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర ప్రభుత్వ సదుపాయాలను పొందేందుకు అక్రిడేషన్ కార్డు కీలకంగా ఉంటుందని గంట్ల కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అక్రిడేషన్ కమిటీ సమావేశం కోసం జిల్లాలో పలువురు అర్హులైన జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ త్వరలో డీఆర్‌సీ సమావేశం జరగనుందని, ఆ సమావేశం పూర్తయిన అనంతరం మూడో మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల సమస్యపై సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటుకు హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్‌కు గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లాలో ఇంకా అర్హత కలిగిన జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని గంట్ల శ్రీనుబాబు కోరారు..

Post a Comment

0 Comments