Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR
జీవీఎంసీ పెందుర్తి జోన్ జోనల్ ఆఫీస్ పి జి ఆర్ ఎస్ లో జీవిఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారిని కలిసి నియోజవర్గం అభివృద్ధిపై వినతి పత్రాన్ని అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తి నియోజకవర్గం పరిధి పెందుర్తి జోన్ మరియు అగనంపూడి జోన్ లలో జీవిఎంసీ నుండి చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అద్యక్షులు, పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేశ్ బాబు కమిషనర్ కేతన్ గార్గ్ గారిని కోరారు.
ఈ రోజు 24.08.2026 తేదీ సోమవారం ఉదయం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు వేపగుంట జీవిఎంసీ పెందుర్తి జోనల్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు కమిషనర్ గారిని కలిసిన ఎమ్మెల్యే రమేశ్ బాబు గారు జీవిఎంసీ నుండి పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి జోన్ మరియు అగనంపూడి జోన్ పరిధిలో జరుగుతున్న రోడ్లు నిర్మాణం, పార్కులు అభివృద్దిని ప్రస్తావించారు. ఇంకా చేపట్టాల్సిన ముఖ్యమైన పనులను వివరించి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే జరుగుతున్న పనులు వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రెండు జోన్ల పరిధిలో ఉన్న శానిటేషన్ మలేరియా డిపార్ట్మెంట్లో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని,
ముఖ్యంగా విలీనగ్రామాల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని విజ్ణప్తి చేసారు. వేపగుంట నుండి జుత్తాడ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణంలో భూములు పోయిన రైతులకు టీడీఆర్ లు ఇంకా ఇవ్వలేదని, దీనిపై వెంటనే చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు గారు జీవీఎంసీ కమిషనర్ గారికి విజ్ణప్తి చేసారు.




0 Comments