సింహాచలం, 24 ఆగస్టు 2026: కేరళ రాష్ట్ర డీజీపీ (స్టేట్ పోలీస్ చీఫ్) శ్రీ రావాడ ఎ. చంద్రశేఖర్ సోమవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
సింహాచలం చేరుకున్న కేరళ డీజీపీ శ్రీ రావాడ ఎ. చంద్రశేఖర్‌కు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వేద ఘోషతో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ శ్రీ జల్లేపల్లి వెంకట్రావు కేరళ డీజీపీ శ్రీ రావాడ ఎ. చంద్రశేఖర్‌ను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా బహూకరించారు.
ఈ కార్యక్రమంలో గోపాలపట్నం సీఐ శ్రీ సన్యాసినాయుడు తదితర పోలీసు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.



0 Comments