ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు27:ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల పరిధిలోని పర్యావరణ శాస్త్ర విభాగాన్ని వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతిగదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఆ సమయంలో అధ్యాపకులు తరగతి గదిలో లేకపోవడం, విద్యార్థులు ఖాళీగా ఉండటం ఆయన గుర్తించారు. వెంటనే కార్యాలయానికి వెళ్లి సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేశారు. నిర్ణీత సమయానికి హాజరుకాని వారిని సెలువుగా పరిగణించాలని సూచించారు. అదే విధంగా విభాగంలో బోధనకు నిర్ధేశించిన గెస్ట్ ఫ్యాకల్టీ నిర్ణీత సమయానికి విభాగానికి హాజరు కాకపోవడం, తరగతులు నిర్వహించకపోవడాన్ని ఆయన గమనించారు.
విధులకు సక్రమంగా హాజరు కావాలని సిబ్బందికి అదేశించారు. విధినిర్వహణలో అలక్ష్యం వహించడం సరికాదన్నారు. తరగతులు సక్రమంగా నిర్వహించాలని, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు.
0 Comments