మండపేటలో పేదల ఇల్లు కూల్చివేత అన్యాయం :మండపేట నియోజకవర్గ పరిశీలకులు వంటెద్దు వెంకన్నాయుడుపేదల పక్షపాతి తోట అరెస్ట్ అప్రజాస్వామికం..

 

              SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....డా. బిఆర్  అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో మండపేట పట్టణానికి సంబంధించి పేదల ఇల్లు కూల్చివేత అన్యాయమని, పుష్కరాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నిరుపేదల ఇండ్లు కూల్చి రోడ్డుపాలు చేయడం, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఒక ప్రజానాయకుని పట్ల కూటమి ప్రభుత్వ చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని  వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మండపేట నియోజకవర్గ పరిశీలకులు వంటెద్దు  వెంకన్నాయుడు అన్నారు. శాసనమండలి సభ్యులు,నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు  పట్ల కూటమి ప్రభుత్వంలో పోలీస్  చర్యలు సాధారణ ప్రజనీకానికి భయందోళనకు గురి చేస్తున్నాయని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నాయుడు అన్నారు.

Post a Comment

0 Comments