ప్రజలకు అతిచేరువలో మున్సిపల్ సేవలు : మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్..... స్వర్ణ వార్డు, సచివాలయలలో ప్రత్యేక గ్రీవెన్స్...

.              SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం పట్టణ ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ధ్యేయంతో అమలాపురం పురపాలక సంఘ కమిషనర్ వి. నిర్మల్ కుమార్  కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రజల వద్దకే సేవలను అందించాలనే లక్ష్యంతో సోమవారం నుండి శుక్రవారం వరకు అమలాపురం పట్టణములో స్థానిక ప్రజల సమస్యలను, స్వర్ణ వార్డు కార్యాలయంలో నేరుగా కమీషనరుకు  మున్సిపల్ అధికారులకు అందజేసే విధంగా సాయంత్రం గం.4.30ల నుండి గం.5.30ల వరకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ లను నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఒక స్వర్ణ వార్డు చొప్పున ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక ప్రజలు నుండి అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తున్నారు. సోమవారం  మొదటగా మెట్లకాలనీ స్వర్ణ వార్డు నందు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, “1” వ మరియు 30వ వార్డు ప్రజల నుండి" 7" అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా వీధీపాల సమస్యలు, త్రాగునీటి సమస్యలు, రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణం, ఇతర సమస్యలకు సంబందించిన పిర్యాదులు వచ్చాయి. 


ఈ సందర్బంగా కమీషనర్ వి.నిర్మల్ కుమార్  మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపల్ కార్యాలయానికి రాకుండానే, తమ అర్జీలను నేరుగా స్థానిక స్వర్ణ వార్డుల నందు కమీషనర్ కి, ఇతర మున్సిపల్ అధికారులకు అందజేయవచ్చునని ,ఈ విధంగా ఇచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో మున్సిపల్ డీఈఈ కె.వి.వి.సత్యనారాయణ, మున్సిపల్ ఏఈఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు,రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments