జాతీయ సేవా పథకంలోని అన్ని కార్యక్రమాలలోకి అత్యంత కీలకమైనది రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంప్ అని జాతీయ సేవా పథకం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రీజినల్ డైరెక్టరేట్ కు చెందిన రీజినల్ డైరెక్టర్ శ్రీ ఆర్. సైదా అన్నారు


విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :స్థానిక ఆంధ్ర విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సెమినార్ హాల్లో నిర్వహించిన పూర్వ గణతంత్ర దినోత్సవ పెరేడ్ ఎంపిక శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ- నవంబర్ 

10వ,తేదీ నుండి 19వ,తేదీ వరకు హైదరాబాదులోని మల్కాజ్ గిరి జిల్లా నందు గల అనురాగ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే పూర్వ గణతంత్ర దినోత్సవ పెరేడ్ శిబిరంలో పాల్గొనే ప్రతిభావంతమైన యువతను ఈరోజు,ఈ శిబిరంలో పారదర్శకంగా ఎంపిక చేస్తామని అన్నారు. 

కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ఎస్. హరినాథ్, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ డి. సింహాచలం, ఆంధ్రవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎన్.విజయ్ మోహన్,

 జాతీయ సేవా పథకం జోనల్ అధికారి డాక్టర్ పి. ఉమామహేశ్వరరావు, జిల్లా నోడల్ అధికారి ఇపిఎస్ భాగ్యలక్ష్మి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదు జిల్లాల ప్రోగ్రాం అధికారులు, పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు.ఈ ఎంపిక ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది.

Post a Comment

0 Comments