విశాఖపట్నం :సెయింట్ జోసెఫ్ కళాశాల బయోకెమిస్ట్రీ విభాగం, ఐక్యూఏసీ సహకారంతో జీవశాస్త్రాల ఆధునిక పురోగతుల అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. తెలిపారు . సదస్సు ప్రధాన ఇతివృత్తం:పర్యావరణ సవాళ్లు – మానవ ఆరోగ్యం: సుస్థిర భవిష్యత్తు కోసం శాస్త్ర సమన్వయం”అనే సమకాలీన అంశంపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది.సదస్సు బ్రోచర్‌ను కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ హేమ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. టి. భాస్కర సుధ, సదస్సు కన్వీనర్ మరియు బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డా. పి. మేరీ అనుపమ, కో-కన్వీనర్ డా. మౌసమి శంకర్ అడ్డాల పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డా. ఇ. హరిణి, డా. డి. ఆదిత్య దీప్తి, డా. ఎస్. దీప్తి, శ్రీమతి ఎ. మేరీ విజయ రత్న, డా. డి. కోటేశ్వరరావు, శ్రీమతి ఎం.వి. లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, మానవ ఆరోగ్యం వంటి ప్రస్తుత ప్రపంచ సమస్యలకు సంబంధించిన అంశాన్ని సదస్సు కోసం ఎంపిక చేయడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు తమ పరిశోధనలు, ఆలోచనలు పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.సదస్సులో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్లకు అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్నవారు సదస్సులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డా. పి. మేరీ అనుపమ – 9885808345ను సంప్రదించవచ్చు.





0 Comments