ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 104 ఫిర్యాదులు*

 

  Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR 
ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు ఈ రోజు 104 ఫిర్యాదులు రావడం జరిగినది* 


ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్  Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., గారు ప్రత్యక్షముగా నగర పోలీసు సమావేశమందిరం నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, ఫిర్యాదులు స్వీకరించారు.


 ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమానికి 104 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా పోలీసు కమిషనర్ గారికి అందజేసినారు. సిపి గారు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదిదారులతో స్వయముగా మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది.  


 ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమంలో  ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి

                  నగర పోలీసు తరపున,

                     విశాఖపట్నం సిటీ.

Post a Comment

0 Comments