జారీ చేసిన వారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 07.09.2026


విశాఖపట్నం- ఎస్.దిలీప్ చక్రవర్తి, రెవిన్యూ డివిజన్ అధికారి, విశాఖపట్నం వారి అధ్యక్షతన సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబెర్ అప్ప్రొప్రియేట్ అథారిటీ మరియు అడ్వైజరీ కమిటీ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం 

జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో RDO  ఛాంబర్ లో జరిగింది. ఈ సమావేశమునకు డా.వై.డి.కళ్యాణి వారు కమిటీ సభ్యులందరిని ఆహ్వానించి, ప్రసంగిస్తూ జిల్లాలో ఉన్నటువంటి స్కానింగ్ కేంద్రములన్ని తనిఖీ చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని, ఈ తనిఖీలు ప్రతీ మూడు నెలలకొకసారి జరుగుతాయని తెలియచేసారు. 

RDOప్రసంగిస్తూ అన్ని స్కానింగ్ కేంద్రములు తగిన సమయంలో తనిఖీ చేయాలని మరియు డెకాయ్ ఆపరేషన్స్ క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులలో కూడా సాధారణ ప్రసవాలు అయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. అడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరం అనే నినాదంతో అవగాహన కలగ చేయాలని IEC కార్యక్రమాలు తరచూ అన్ని ప్రాంతాలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రము సందర్శన కి వెళ్ళినప్పుడు ఆ కేంద్రములో ఉన్న రిజిస్టర్ల ను క్షుణ్ణంగా పరిశీలించమని ఆదేశించారు. 

ఈ సమావేశం లో డా. వై.డి.కళ్యాణి, మెడికల్ ఆఫీసర్, డా.ఉషాప్రసాద్, గైనకాలజిస్ట్, VGH, డా.శ్రీకాంత్, రేడియాలజిస్ట్, డా.మదన్ మోహన్, పిడియాట్రిక్స్, శ్రీ బి.నాగేశ్వర రావు డెమో, శ్రీమతి రామలక్ష్మి, NGO, శ్రీమతి సూర్యకళ, SI, విశాఖపట్నం మహిళా పోలీస్ స్టేషన్ వారు పాల్గొన్నారు. 





జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                             విశాఖపట్నం

Post a Comment

0 Comments