కొద్ధి నెలలుగా పెండింగ్‌లో ఉన్న హయ్యర్ పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని RPFC కార్యాలయానికి విజ్ఞప్తి చేసిన RINL-విశాఖ ఉక్కు కర్మాగారం హయ్యర్ పెన్షనర్లు*


విశాఖపట్నం-సెప్టెంబర్ 7, 2026:RINL–విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన హయ్యర్ పెన్షనర్లు  గత కొద్ధి నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ   హయ్యర్ పెన్షన్లను వెంటనే  విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు (  సోమవారం)  మర్రిపాలెం లోని    విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ (RPFC) కార్యాలయానికి వెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన హయ్యర్ పెన్షనర్లతరఫున    వినతిపత్రం సమర్పించారు.

EPFO ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు (Jeevan Pramaan) ఇప్పటికే ఆమోదం పొందినప్పటికీ, పలువురు విశాఖ ఉక్కు కర్మాగారం   హయ్యర్ పెన్షనర్లకు జూన్, జూలై మరియు ఆగస్టు 2026 నెలలకు సంబంధించిన పెన్షన్లు ఇంకా జమ కాలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, పెన్షనర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సమస్యకు కారణమైన సాంకేతిక లోపాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న పెన్షన్ మొత్తాలను ప్రభావిత పెన్షనర్లందరికీ తక్షణమే జమ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని RINL–విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన హయ్యర్ పెన్షనర్లు EPFO అధికారులను వినమ్రంగా కోరారు.

RINL (Visakhapatnam Steel Plant) Pensioners తరఫున శ్రీ S. ఆత్మ రామ శర్మ, శ్రీ M.N. ప్రసాద్, శ్రీ C.V. రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం విశాఖపట్నం ప్రాంతీయ PF కార్యాలయం PRO శ్రీ శ్రీనివాస్ నాయక్ గారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరింది.

పెన్షనర్ల విజ్ఞప్తిపై PF కార్యాలయ అధికారులు సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పెన్షనర్లు PF అధికారులు సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్య త్వరితగతిన పరిష్కారమై, పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు అన్ని అర్హులైన పెన్షనర్ల ఖాతాల్లో జమ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

— RINL–విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హయ్యర్ పెన్షనర్ల తరఫున

దయ చేసి ప్రచురింప ప్రార్ధన 

ద్వారం స్వామి 

విశాఖ ఉక్కు కర్మాగారం  డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) -రిటైర్డ్

Post a Comment

0 Comments