సింహాచలం తేది: 07-09-2026 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి విశాఖపట్నం ఎండాడకు చెందిన భక్తురాలు శ్రీమతి ధనుకొండ శృతి సోమవారం వెండి పూజా సామగ్రిని బహూకరించారు.సుమారు 3 కేజీల 34 గ్రాముల (3.034 కిలోలు) బరువు కలిగిన వెండి వస్తువులను ఆమె ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ గారికి ఆలయ కార్యాలయంలో లాంఛనంగా అందజేశారు.
మొత్తం బరువు: 3 కేజీల 34 గ్రాములు అంటే సుమారు ₹7.58 లక్షలు (మిసిలేనియస్ రశీదు నెం. 9763) అందజేశారు.
స్వామివారికి ఈ కానుకలను సమర్పించిన దాతకు ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.


0 Comments