నేడు (ఈ నెల 11న) వీఎంఆర్‌డీఏలో ఓపెన్‌ ఫోరం

వీఎంఆర్‌డీఏకు సంబంధించి ఏదైనా సమస్యలపై ప్రజలు అధికారులకు తెలియజేసేందుకు వీలుగా వీఎంఆర్‌డీఏ  మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ శ్రీ కేతన్‌గార్గ్‌ నేతృత్వంలో ఈ నెల 11న ఓపెన్‌ ఫోరం నిర్వహించటం జరుగుతోంది. ప్రజల సౌకర్యార్ధం వీఎంఆర్‌డీఏకు చెందిన అన్ని విభాగాలకు సంబంధించిన సమస్యలను అధికారులకు నేరుగా తెలియజేసే  అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఓపెన్‌  ఫోరం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో 9వ అంతస్తు సమావేశమందిరంలో నిర్వహిస్తున్నారు. వీఎంఆర్‌డీఏ పరిధిలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ శ్రీ కేతన్‌గార్గ్‌ ఒక ప్రకటనలో కోరారు.

Post a Comment

0 Comments