విశాలాక్షినగర్‌లో శుక్రవారం సీఎన్‌ఆర్ వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలు మరింత పెరిగాయని అన్నారు. ఫలితంగా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో పర్యాటక, ఆతిథ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖలో తాజాగా 16 హోటళ్లకు పర్యాటక శాఖ అనుమతులు జారీ చేసిందని తెలిపారు. భోగాపురం పరిసర ప్రాంతాలు రానున్న రోజుల్లో వేగంగా అభివృద్ధి చెంది సాటిలైట్ టౌన్‌షిప్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉందన్నారు.
అభిమానుల ఆదరణే నా బలం*ప్రముఖ సీరియల్ నటుడు బాలు మాట్లాడుతూ సీఎన్‌ఆర్ వెంచర్స్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, వారి ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని అన్నారు. భవిష్యత్తులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పటికీ మరువబోనన్నారు.*సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం*సీఎన్‌ఆర్ వెంచర్స్ అధినేతలు చెల్లుబోయిన రాము, చెల్లుబోయిన నర్సింగరావు.. చంటిలు తొలుత వంశీకృష్ణ శ్రీనివాస్ ..నటుడు బాలును సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. తమ సంస్థల అభివృద్ధిలో ప్రజల ఆశీస్సులు, సహకారం కీలకమని వారు తెలిపారు. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని, పేదలకు తమ పరిధి మేరకు సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు.. అయ్యప్ప రెడ్డి.. ప్రసాద్ నాయుడు.. తదితరులు పాల్గొన్నారు.. బాలుతో
ఫోటోలు దిగేందుకు స్థానిక మహిళా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు


0 Comments