69వ ప్రారంభోత్సవ కార్యక్రమం సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (ఆటోనమస్), విశాఖపట్నం


విశాఖపట్నం లో 19 సెప్టెంబర్ 2026 ఉదయం 9:30 గంటలకు జరిగింది. కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభమై, స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం 2026–27 యాక్షన్ ప్లాన్ సమర్పించబడింది. ముఖ్య అతిథి డా. ఐ. వాణి, సూపరింటెండెంట్, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం, ప్రారంభ ప్రసంగం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజి పి.డి., వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ హేమ, ఆఫీస్ సూపరింటెండెంట్ సిస్టర్ మేరీ, మరియు అధ్యాపక సలహాదారులు డా. కెప్టెన్ కె. సుజాత (గణితశాస్త్ర విభాగాధిపతి), మిసెస్ సోనీ, డా. మౌసమీ, మిసెస్ ప్రత్యూష, మిసెస్ ఉర్మిళ, డా. సిస్టర్ లత, డా. కోటేశ్వరరావు, డా. ప్రవీణ్ హాజరయ్యారు.

స్టూడెంట్ కౌన్సిల్ అధ్యక్షురాలు ముగా ప్రవల్లిక, సభ్యులు మోనాలిసా, చారిష్మా, ప్రగ్న, వైష్ణవి, లికిత, ఏంజెల్ కుజూర్, నిహారిక రత్నం, పద్మ యశస్విని తదితరులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.

 అవార్డు గ్రహీతలు డా. గాయత్రి, డా. సౌజన్య, డా. మాధవి, డా. సిస్టర్ లత, డా. కిషోర్ లను సత్కరించారు. అలాగే గణితశాస్త్రం & గణాంక విభాగాధిపతి డా. కెప్టెన్ కె. సుజాత Sri Lanka 

అంతర్జాతీయ సదస్సులో పాల్గొని Indo–Sri Lankan Research Excellence Award 2026 అందుకున్న గౌరవాన్ని ముఖ్య అతిథి చేత సత్కరించడం కళాశాలకు గర్వకారణమైంది.

కార్యక్రమం అధ్యాపకుల సత్కారం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది.

Post a Comment

0 Comments