విశాఖపట్నం- సెప్టెంబర్ 14, 2026 -హిందీ దివస్ (సెప్టెంబర్ 14) సందర్భంగా సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, గ్నానాపురంలో హిందీ విభాగం ఆధ్వర్యంలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వీఎస్ కృష్ణ కళాశాల హిందీ ఆచార్యులు డా. లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల హిందీ అధ్యాపకురాలు డా. ఎస్. దీప్తి హిందీ విభాగ నివేదికను సమర్పించారు ..హిందీ భాష పట్ల విద్యార్థినుల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతను వెలికితీయడానికి వాదవివాదం, వ్యాసరచన, కవితా పఠనం, ప్రశ్నోత్తర పోటీలు తదితర సాహిత్య, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా హిందీ విభాగం విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలిచిన ‘ప్రతిభ’ విభాగ పత్రికను ఆవిష్కరించారు. అలాగే సుదీపా, ప్రియ హిందీ దివస్ ప్రాధాన్యతను ప్రతిబింబించే హిందీ కవితలను పఠించారు.పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి డా. లక్ష్మి మరియు కార్యక్రమ నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో హిందీ భాష, సాహిత్యం పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు, వారి వక్తృత్వం, రచనా సామర్థ్యం, సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.







0 Comments