SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం...భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అల్లవరం మండలం మొగళ్ళమూరులోని శ్రీ కోదండ రామాలయం వద్ద మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి ఆధ్వర్యంలో మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలుతో వర్ధిల్లాలని ఆశీర్వాద దీపాలు వెలిగించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నలు దిశలా చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


0 Comments