సిరగట్లపల్లి రహదారి గుంతలు పుడ్చాలాంటూ ఎంపీడీవోకు వినతిపత్రం: బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి

.         SRINIVAS SPL Correspondent 
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామపంచాయతీ పరిధిలోని సిరగట్లపల్లి వెళ్లే ప్రధాన రహదారి గుంతలు మయంగా మారి విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి దృష్టికి  సమస్యను ప్రజలు తీసుకురాగా  అల్లవరం ఎంపీడీవో గౌరీకుమారి కు  వినతి పత్రం ద్వారా  తీసుకువెళ్లడం జరిగింది . ఈ సందర్భంగా  సత్యనారాయణ మూర్తి  మాట్లాడుతూ ఈ రోడ్డుపై వెళ్తున్న స్కూల్ బస్సులు చాలా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణిస్తున్నాయని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ రహదారి పూర్తయ్యే లోపు ముందస్తు చర్యగా రోడ్డుపై హెచ్చుతగ్గులు లేకుండా గ్రావెల్స్ తో సరి చేయాల్సిందిగా ఎంపీడీవోకు  విన్నవించడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీడీవో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్ల రాము, కటికరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments