విశాఖపట్నం -ఈరోజు అనగా తేదీ 18.09.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు భీమిలి పట్టణ ఆరోగ్య కేంద్రమును సందర్శించి సేవా సంకల్ప్ అభియాన్ మరియు సంజీవని ప్రోగ్రాం గురించి విపులంగా వివరించారు. వైద్య ఆరోగ్య సిబ్బందిని పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్ గురించి సమీక్షించారు. అక్కడ జరుగుతున్న డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని సందర్శించారు. తదుపరి ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట, ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ సందర్శనలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి.నాగభూషణం వారు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం




0 Comments