2,500 పెన్నులతో వినాయకునికి ప్రత్యేక పూజ* శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

 


విశాఖపట్నం, సెప్టెంబర్ 16, 2026:ఎం.వి.పి. కాలనీలోని శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో సిటీ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పాంచరాత్రి పూజల్లో భాగంగా గణేశ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం ఆరిలోవ భజన మండలి భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బాలవికాస్ గురువుల ఆధ్వర్యంలో 2,500 పెన్నులతో గణేశునికి విశిష్టమైన ప్రత్యేక పూజ నిర్వహించారు.

అనంతరం బాలవికాస్ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో గణేశ పంచరత్నాలను పఠించారు. తదుపరి లాసన్స్ బే కాలనీ భజన మండలి సభ్యులు భక్తి భజనలు ఆలపిస్తూ గణేశునికి ఆరాధన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు, బాలవికాస్ గురువులు, విద్యార్థులు, భజన మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ గణేశుని కృపకు పాత్రులయ్యారు.

మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో కొనసాగింది.


Post a Comment

0 Comments