విశాఖపట్నం : వినాయక చవితిని పురస్కరించుకొని లక్కీ బాయ్స్ ఆధ్వర్యంలో సీతంపేట, హిందూ ముస్లిం కాలనీలో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని చిన్నారులు, యువత ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి, మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, రెండో రోజు ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం దీపారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మూడో రోజు సుమారు 800 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆరంగి వెంకట లక్ష్మణరాజు – సంధ్యారాణి దంపతులు, గణ మామ బిర్యానీ పాయింట్ నిర్వాహకులు రాజాన గణేష్ – సంతోషి దంపతులు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే రోజు సాయంత్రం గణపతి విగ్రహాన్ని కాలనీ పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించి, అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊరేగింపు, నిమజ్జనోత్సవంలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. చిన్నారులు, యువత సంప్రదాయాలను తెలుసుకుంటూ, భక్తిభావంతో పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు కాలనీలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని


0 Comments