అమలాపురం, విశాఖ సందేసం....భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా, ప్రపంచ రోగి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని అమలాపురం రూరల్ మండలం ఏ. వేమవరప్పాడు ఆరోగ్య కేంద్రంలో అసంక్రమిత వ్యాధుల (NCDs) నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గ్రామ మాజీ ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరరావు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్మాబత్తుల ప్రసాద్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి నక్క నాగవేణి, వాసంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు అసంక్రమిత వ్యాధుల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. ఆరోగ్య కేంద్రంలో హిమోగ్లోబిన్, రక్తంలో చక్కెర, మలేరియా, డెంగ్యూ, హెచ్‌ఐవీ, హెపటైటిస్-బి తదితర పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించే సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి బండారులంక, వైద్య బృందం డాక్టర్ గౌతమి,పీహెచ్‌ఎన్ విమలాదేవి,ఎంఎల్‌హెచ్‌పీ సునీత, ఏఎన్‌ఎం పల్లాలమ్మ,ఆశా కార్యకర్త నాగమణి, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

0 Comments