సింహాచలం: తేదీ: 6 సెప్టెంబర్ 2026 రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పరవాడ సింహాచలంనాయుడు (పీఎస్ నాయుడు) దంపతులు ఆదివారం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పిల్లా శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి శ్రీ రామజోగరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ముందుగా వారు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం ఆలయ అధికారులు పీఎస్ నాయుడు దంపతులను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా బహుకరించారు.సింహాచల క్షేత్ర దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పీఎస్ నాయుడు దంపతులు పేర్కొన్నారు.


0 Comments