సింహాచలం, సెప్టెంబర్ 6, 2026:సింహాచల క్షేత్రంలో శ్రీశ్రీశ్రీవరాహలక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో ఆదివారం పలు విశేష పూజలు, సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ ఎంబార్ మానార్ మాస తిరు నక్షత్ర వేడుకలను వైదిక సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది.
భక్తులను అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనదేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్య కళను పరిచయం చేసే ఉద్దేశంతో సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన శ్రీ వైష్ణవి కళాక్షేత్రి కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాగిన ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు వివిధ భక్తి, పౌరాణిక అంశాలను నృత్య రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. భక్తులు ఆసక్తిగా వీక్షిస్తూ కళాకారులను అభినందించారు.
స్వామివారి విశేష సేవలతో పాటు భారతీయ సాంప్రదాయ కళలను భక్తులకు చేరువ చేసేలా ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.
0 Comments