కొత్తచెరువు- విశాఖ సందేశం వర్తవాహని -భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య ఆశీస్సులతో, గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. మలేషియా భక్తుల పర్తియాత్రలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల నేషనల్ సేవా కోఆర్డినేటర్ శ్రీ ఎస్. కోటేశ్వరరావు, జాయింట్ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ చంద్రశేఖరన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు శ్రీ కె. సత్యనారాయణ మూర్తి, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ సీతారాం, జిల్లా యువజన కోఆర్డినేటర్ శ్రీ పి. సురేష్ పాల్గొన్నారు.అలాగే గ్లోబల్ కౌన్సిల్ మలేషియా ప్రతినిధులు, అధ్యక్షులు మరియు సుమారు 200 మంది మలేషియా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించారు.
మలేషియా భక్తుల పర్తియాత్రలో భాగంగా వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడంతో పాటు, అవసరార్థులకు సుమారు 300 మందికి చీరలు, పంచెలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సేవా స్ఫూర్తిని చాటారు.
శ్రీ సత్యసాయి బాబా బోధించిన “మానవ సేవే మాధవ సేవ” అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. నీటి సౌకర్యం కల్పించడంతో పాటు వస్త్రాల పంపిణీ ద్వారా సేవాభావాన్ని చాటిన మలేషియా భక్తులను పలువురు అభినందించారు.



0 Comments