పుట్టపర్తి: విశాఖ సందేశం వర్తవాహని -3.9.2026 ,శ్రీ సత్యసాయి బాబా దివ్య సన్నిధిలో విశాఖజిల్లా భక్తులు చేపట్టిన మూడు రోజుల పర్తి యాత్రలో నేడు తొలిరోజు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. దివ్య శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని, విశాఖజిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 2,000 మందికి పైగా భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు.
పర్తి యాత్ర తొలిరోజు సందర్భంగా సాయి కుల్వంత్ సభా మండపంలో ఉదయం, సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో విశాఖజిల్లా మహిళా భక్తులు వేదపఠనం నిర్వహించారు. వారి శ్రావ్యమైన వేదఘోషతో సభా మండపం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
అనంతరం సాయంత్రం నిర్వహించిన *“మానస సంచరరే” ప్రత్యేక ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది*. మధురమైన భక్తిగీతాలు, హృద్యమైన సంగీత స్వరాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. కళాకారుల అద్భుతమైన గాన ప్రదర్శనకు భక్తుల నుంచి విశేష స్పందన లభించగా, కార్యక్రమం ఆద్యంతం భక్తులు పరవశంతో ఆస్వాదించారు.
మూడు రోజుల పర్తి యాత్రలో భాగంగా తొలిరోజునే విశాఖజిల్లా భక్తులు వేదపఠనం, భజనలు, ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలతో శ్రీ సత్యసాయి బాబా దివ్య సన్నిధిలో తమ భక్తిభావాన్ని చాటారు.
విశాఖజిల్లా మహిళా భక్తుల వేదఘోష, భక్తిగీతాలు, మధురమైన సంగీత స్వరాల సమ్మేళనంతో సాయి కుల్వంత్ సభా మండపం భక్తిభావంతో మార్మోగింది. శ్రీ సత్యసాయి బాబా దివ్య సన్నిధిలో ప్రారంభమైన ఈ మూడు రోజుల పర్తి యాత్ర భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది
0 Comments