విమ్స్ లో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం


విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని -ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు, విజయవాడ వారి సూచనలు మరియు ఆదేశాల ప్రకారం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్), విశాఖపట్నంలో 17.09 2026 న ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం- 2026 సందర్భంగా “Safe Care for Non communicable Diseases" , "Safe Care for Life!” ৬ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా విమ్స్ డైరెక్టర్ డా. వి. మన్మధరావు గారు మాట్లాడుతూ, రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యపరమైన పొరపాట్ల నివారణ, మందుల భద్రత, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల సరైన గుర్తింపు, సమర్ధవంతమైన సమాచార మార్పిడి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. అసంక్రమిక వ్యాధులతో బాధపడుతున్న వారికి దీర్ఘకాలిక చికిత్స అందించే సమయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సి.హెచ్. శ్రీనివాస కుమార్, అడ్మినిస్ట్రేటర్ డా. మనోజ్ కుమార్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ ఆర్. శిరీష మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ రోగి భద్రత నాణ్యమైన వైద్య సేవల్లో అంతర్భాగమని, ప్రతి ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమం ముగింపులో సిబ్బంది రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించేందుకు తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తామని రోగి భద్రత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments