విశాఖపట్నం -విశాఖ సందేశం వర్తవాహని- శ్రీ స్వామి వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ వారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను 3 రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకలకు ముఖ్యఅతిథిగా
దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేసి కృష్ణాష్టమి వేడుకలను ప్రారంభించారు. అనంతరం గోమాతకు పూజలు చేసి, శ్రీకృష్ణ భగవానుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానంద సంస్థ నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కృష్ణాష్టమి వేడుకలలో చిన్ని శ్రీకృష్ణుని, వసుదేవుడు యమునా నదిని దాటిస్తున్న ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ,
వివేకానంద సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మహా అన్నదాన కార్యక్రమాలు, ఉచిత ఐ క్యాంపులు నిర్వహిస్తూ, మానవసేవే- మాధవసేవ లో త రిస్తున్నారు అని సంస్థ వారిని కొనియాడారు. ఈ వేడుకలలో వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకు వెళ్తున్న ఘట్టం మహా అద్భుతంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, ప్రముఖ సంఘ సేవకులు వేణుగోపాల్ , శ్రీమతి కొల్లి సింహాచలం , 39 వ వార్డు Exకార్పొరేటర్ సాధిక్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
0 Comments