ఒక నైపుణ్యం… ఒక అవకాశం… ఒక కొత్త జీవితం!” *పుట్టపర్తిలో ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ R.J. రత్నాకర్ శ్రీకారం — త్వరలో పుట్టపర్తిలో శాశ్వత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు – శ్రీ R.J. రత్నాకర్*


పుట్టపర్తి-విశాఖ సందేశం వర్తవాహని - సెప్టెంబర్ 6, 2026:భగవాన్  శ్రీ సత్య సాయి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థల  *శ్రీ సత్య సాయి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు అందిస్తున్న 38 రోజుల ఉచిత “Tally with GST” శిక్షణ కార్యక్రమాన్ని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ R.J. రత్నాకర్ గారు ఈ రోజు (ఆదివారం) పుట్టపర్తిలోని మేడా గెస్ట్ హౌస్‌లో ప్రారంభించారు.*

ఈ శిక్షణా కార్యక్రమానికి అవసరమైన కంప్యూటర్లను శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సమకూర్చింది.  ఈ ఉచిత శిక్షణా తరగతుల్లో ఆర్ధికంగా వెనుకబడిన 35 మంది మహిళలు శిక్షణ పొందనున్నారు* 

ఈ సందర్భంగా పుట్టపర్తిలో త్వరలో శాశ్వత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య  శ్రీ R.J. రత్నాకర్ గారు ప్రకటించారు. స్థానిక యువత, మహిళలు మరియు నైపుణ్య శిక్షణ ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఈ కేంద్రం నిరంతర శిక్షణ, మార్గదర్శకత్వం, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలకు ఒక వేదికగా నిలుస్తుందని  శ్రీ R.J. రత్నాకర్ గారు తెలిపారు.

“యువతకు నైపుణ్యం… వారి భవిష్యత్తుకు బలమైన పునాది!”* ఈ సందర్భంగా శ్రీ R.J. రత్నాకర్ గారు మాట్లాడుతూ, నేటి సమాజంలో యువతకు నైపుణ్యాభివృద్ధి అత్యంత అవసరమని, ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడం వారి భవిష్యత్తుకు కొత్త మార్గాలను తెరుస్తుందని అన్నారు.

పిల్లలు, యువత ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే ఆసక్తిని చూపినప్పుడు వారికి పరిమితులు విధించకుండా ప్రోత్సహించడం, అవకాశాలు కల్పించడం, అవసరమైన శిక్షణ మరియు వనరులను అందించడం సమాజం యొక్క బాధ్యత అని  శ్రీ R.J. రత్నాకర్ గారు పేర్కొన్నారు.

ఒక కొత్త నైపుణ్యం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు, తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ప్రత్యేకంగా మహిళలు, సింగిల్ మదర్స్ కుటుంబాలకు చెందిన యువత, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని  శ్రీ R.J. రత్నాకర్ పిలుపునిచ్చారు.

*“ఇది కేవలం ఒక శిక్షణ కాదు… ఒక జీవితాన్ని మార్చగల అవకాశం"* అని   పేర్కొంటూ శిక్షణ అనంతరం అందించే సర్టిఫికేషన్ భవిష్యత్తులో ఉద్యోగం, ఉపాధి మరియు ఇతర అవకాశాలను పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీ రత్నాకర్ గారు తెలిపారు.

🌱 “వారి విజయం… మనందరి విజయం”

నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి మనం సమయం కేటాయించి, శిక్షణకు ప్రోత్సహించి, అవసరమైన సహకారం అందించాలని  శ్రీ R.J. రత్నాకర్ గారు అన్నారు.

“ఒక మంచి శిక్షణ, ఒక మంచి సర్టిఫికేట్, ఒక చిన్న ప్రోత్సాహం — ఒక యువకుడి లేదా యువతి జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకురాగలదు” అని పేర్కొన్నారు.

🌟 ఆంధ్రప్రదేశ్‌లో 20,000 మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ -రాష్ట్రవ్యాప్తంగా 23 శాశ్వత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు

ఈ సందర్భంగా *శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ R. లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో సుమారు 20,000 మంది యువతకు పలు ఉపాధి ఆధారిత రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించినట్లు తెలిపారు*.

కంప్యూటర్ శిక్షణ, Tally with GST, AC రిపేర్, జూట్ బ్యాగుల తయారీ, టైలరింగ్, బ్యూటీషియన్, బెడ్‌సైడ్ అసిస్టెంట్, మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, సెల్‌ఫోన్ రిపేర్ తదితర కోర్సుల్లో శిక్షణ అందించినట్లు చెప్పారు.

ఈ శిక్షణ ద్వారా అనేకమంది యువత ఉపాధి అవకాశాలను పొందుతూ, తమ కాళ్లపై తాము నిలబడే దిశగా ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23 చోట్ల శాశ్వత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మణరావు గారు తెలిపారు.

అదేవిధంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో త్వరలో ఆరు జిల్లాల్లో వైద్య రంగానికి సంబంధించిన నైపుణ్య కోర్సులను ప్రారంభించనున్నట్లు, అలాగే RSETI సహకారంతో వివిధ జిల్లాల్లో మరిన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న కెనరా బ్యాంక్ RSETIకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

🌱 *“నైపుణ్యమే అవకాశాలకు వారధి- శ్రీ ఎస్  కోటేశ్వరరావు*

శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ సేవా కోఆర్డినేటర్ శ్రీ కోటేశ్వరరావు గారు స్కిల్ డెవలప్‌మెంట్ సేవల ప్రాముఖ్యతను వివరించారు.

యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ మరియు అవకాశాలు అందించడం ద్వారా వారిని స్వావలంబన దిశగా నడిపించవచ్చని అన్నారు.

🌸 *“మహిళలకు సాధికారత… కుటుంబాలకు బలం… సమాజానికి అభివృద్ధి”- శ్రీమతి (డాక్టర్ ) ఎల్  శశి బాల*

శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ సేవా కోఆర్డినేటర్ (మహిళలు) శ్రీమతి శశి బాల గారు మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం, స్వావలంబన మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయవచ్చని తెలిపారు.

💼 *“Tally with GST – ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యం”*

కెనరా బ్యాంక్ RSETI డైరెక్టర్ శ్రీమతి N. శాంతి ప్రియ గారు మాట్లాడుతూ, ప్రస్తుత ఉద్యోగ, వ్యాపార రంగాల్లో Tally with GST నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. RSETI తరఫున అందిస్తున్న ఉచిత శిక్షణ, శిక్షణార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం మరియు సర్టిఫికేషన్ గురించి వివరించారు.

శిక్షణ నుంచి స్వావలంబన వరకు…శ్రీ సత్య సాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు కేవలం ఒక కోర్సును అందించడానికే పరిమితం కాకుండా, యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి ఆత్మవిశ్వాసాన్ని అందించి, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాల వైపు నడిపించే సేవా ఉద్యమంగా కొనసాగుతున్నాయి.

“నేర్చుకుందాం… ఎదుగుదాం… స్వావలంబన సాధిద్దాం!”

నేటి ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, కృషి, అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం యువత భవిష్యత్తుకు ఎంతో అవసరమని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు.

పుట్టపర్తిలో త్వరలో ఏర్పాటు కానున్న శాశ్వత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, యువత మరియు మహిళలకు నైపుణ్యాలను అందించి, వారి ప్రతిభను అవకాశాలుగా మార్చి, స్వావలంబన వైపు నడిపించే మరో మహత్తర సేవా వేదికగా నిలవనుంది.

కార్యక్రమానికి శ్రీ K. నాగ ప్రసాద్, స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌చార్జ్ సమన్వయకర్తగా వ్యవహరించగా, శ్రీ సురేష్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ వందన సమర్పణ చేశారు.

*ముందుగా శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు శ్రీ కే   సత్యనారాయణ మూర్తి గారు స్వాగతం పలికారు*.విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, సేవాదళ్, భక్తులు పాల్గొన్నారు

                      కె.వి.శర్మ సంపదకులు

Post a Comment

0 Comments