​శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. ​సింహాద్రి నాధుని నిత్య అన్నప్రసాదం నకు ₹1,00,016 విరాళం అందించిన దాత


సింహాచలం, 29 సెప్టెంబర్ 2026:సింహాచల క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య అన్నప్రసాదం నకు  విశాఖపట్నం, కూర్మన్నపాలెంకు చెందిన శ్రీ ఎల్. భాస్కరం గారు ₹1,00,016/- (అక్షరాలా ఒక లక్ష పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు.

​విశాఖపట్నం, కూర్మన్నపాలెం, శాతవాహన నగర్ నివాసి అయిన శ్రీ ఎల్. భాస్కరం మంగళవారం నాడు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ని కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చెక్కు (చెక్కు నెం: 429054) రూపంలో ఈ విరాళాన్ని అందజేశారు.

​విరాళం స్వీకరించిన అనంతరం దాతకు ఆలయ అధికారులు స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం పలకగా, అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. 

అన్నదానం వంటి మహత్తర కార్యక్రమానికి సహకరించిన దాతకు ఆలయ ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments