స్కిల్ టు సేవ’ — మహిళా సాధికారతకు ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల స్ఫూర్తిదాయక ముందడుగు- పుట్టపర్తిలో 38 రోజుల ‘శ్రీ సత్యసాయి ట్యాలీ విత్ GST’ ఉచిత శిక్షణ కార్యక్రమం ఘన ముగింపు

 


పుట్టపర్తి, అక్టోబర్ 17:శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సేవలలో భాగంగా పుట్టపర్తిలో 38 రోజుల క్రితం ప్రారంభించిన శ్రీ సత్య సాయి Tally with GST ఉచిత శిక్షణ కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. మహిళా యువతకు అకౌంటింగ్, ట్యాలీ మరియు GSTపై నైపుణ్యాలను అందించడంతో పాటు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 24 మంది మహిళలు శిక్షణ పొందారు.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జాతీయ సేవ కోఆర్డినేటర్ శ్రీ S.కోటేశ్వర రావు , జాతీయ మహిళా సేవా కోఆర్డినేటర్ శ్రీమతి శశిబాల ,జాతీయ జాయింట్ సేవా కోఆర్డినేటర్ శ్రీ ఎస్ ఆర్ చంద్రశేఖరన్, శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు,  లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ ఫణీంద్రకుమార్ , కెనరా బ్యాంక్ Rseti డైరెక్టర్ శ్రీమతి శాంతిప్రియ , శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ C గౌతం, జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.

రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమముల ఇంచార్జి శ్రీ K. నాగప్రసాద్  అతిథులను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందిన ట్రైనీలు వేద పఠనం చేస్తూ, భజనలు ఆలాపిస్తూ అతిథులను మంత్ర ముగ్ధులను చేశారు. 38 రోజుల పాటు Tally with GSTలో శిక్షణ పొందిన ఈ 24 మంది మహిళా యువత, వేదం మరియు భజనల్లో కూడా శిక్షణ పొంది, తమ ఆధ్యాత్మిక సాధనను ముగింపు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ ఆర్. లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ వృత్తుల్లో సుమారు 20,000 మందికి శిక్షణ అందించామని, వారిలో అనేక మంది శిక్షణ అనంతరం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, వారిలో సేవా భావాన్ని పెంపొందించడం కూడా సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు.

శ్రీ S. కోటేశ్వర రావు గారు మాట్లాడుతూ, ట్రైనీలతో మాట్లాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. శిక్షణలో పొందిన నైపుణ్యాలను నిరంతరం అభ్యసిస్తూ, జీవితంలో ఔత్సాహికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదించారు.

శ్రీమతి శశిబాల గారు మాట్లాడుతూ, ట్రైనీలు వృత్తిపరమైన ఉన్నతమైన శిక్షణతో పాటు ఆధ్యాత్మిక విలువలను కూడా నేర్చుకోవడం అభినందనీయమని అన్నారు.

శ్రీ ఫణీంద్రకుమార్ గారు, డైరెక్టర్ శ్రీమతి శాంతిప్రియ గారు మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరెన్నో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 24 మంది ట్రైనీలకు శ్రీ S. కోటేశ్వర రావు గారు, శ్రీమతి శశిబాల గారు, శ్రీ R. లక్ష్మణ రావు గారు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా 24 మందికి సాయి కనెక్ట్ అందజేయడం జరిగింది. శిక్షణ పొందిన మహిళలు నవంబర్‌లో జరిగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన సేవా కార్యక్రమాలకు హాజరై సేవ చేయాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

శ్రీ సురేష్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో లక్ష్మీ గారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, రాజకుమార్, రాజేంద్ర, శ్రీనివాస్, శ్రీనివాసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Skill to Seva’ — నైపుణ్యం నుంచి సేవ వైపు

వృత్తి నైపుణ్యంతో ఆత్మవిశ్వాసం.. ఆధ్యాత్మిక విలువలతో సేవా స్ఫూర్తి.. అనే సమన్వయంతో పుట్టపర్తిలో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు, యువత నైపుణ్యాభివృద్ధికి ఒక స్ఫూర్తిదాయకమైన ముందడుగుగా నిలిచింది.

Post a Comment

0 Comments