విశాఖపట్నం కురుపాం మార్కెట్ ప్రాంతంలో కొలువైయున్న పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుచున్నవి. ఐదవ రోజైన బుదవారం నాడు ఆలయంలో తెల్లవారుఝామున మూలవిరాట్ కు పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యములు మరియు వివిధ రకాల పండ్ల రసములతో కలిసి మొత్తం108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారిని వివిధ పరిమళభరితమైన పుష్పాలతో మరియు 108 సువర్ణ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వాసవి కనకదుర్గాదేవికి ఉదయం భక్తులచే స్వయంగా కలశ కుంకుమ పూజలు జరిపించారు.
అనంతరం ఆలయ ఆవరణలో మహిళాభక్తులు లలితాసహశ్రనామ పారాయణ గావించారు. ప్రధాన అర్చకులు శ్రీ ఆర్ బి బి కుమార్ శర్మ గారి నేతృత్వంలో మహిళలచే సామూహిక సువాసిని పూజలు నిర్వహించారు.
విశాఖ నగరం వన్ టౌన్ ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా దేవాలయానికి సంబంధించిన ముఖద్వారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం పూర్తిగా కోల్పోయిన సందర్భంలో దేవాలయం పునర్నిర్మించవలసి ఉంటుందని, ఆ కారణంగా బాలాలయం క్రొత్తగా నిర్మించి యదావిధంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.ప్రత్యక్షంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలతో పాటు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకున్న భక్తుల పేరిట పూజాదికాలు నిర్వహించినట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి డి.వి.బాలాజి కుమార్ తెలిపారు.
అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవస్థాన సంఘ కోశాధికారి శ్రీ దోమ వెంకట బాలాజీ కుమార్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్లు శ్రీయుతులు వై.వి.వి.విశ్వనాధ్, పి.ఎస్.ఆర్. కిషోర్, ఉసిరికల రామకృష్ణ తదితరులు మరియు మహిళాకమిటి సభ్యులు పాల్గొన్నారు.సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నాట్యదీపిక కూచిపూడి అకాడమి శ్రీమతి ఇంద్రాణి రెడ్డి వారి బృందం వారిచే నాట్య ప్రదర్శన కార్యక్రమం కడు రమ్యంగా జరిగింది.



0 Comments