గాంధీజీ సేవలు చిరస్మరణీయం శాంతి, అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్యానికి మహాత్ముని అపార సేవలు: వెంకట కృష్ణారావు పొట్నూరు


విశాఖపట్నం: గాంధీ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని అబిద్నగర్ పార్కులో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కల వంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విశాఖ జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు పొట్నూరు వెంకటకృష్ణారావు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. సత్యం, అహింన, శాంతియుత పోరాటం వంటి సిద్ధాంతాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు, ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని వెంకటకృష్ణారావు అన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని, అందులో భాగంగానే గాంధీ జయంతిని పురస్కరించుకొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పొట్నూరు. వెంకటకృష్ణారావు కోరారు.

Post a Comment

0 Comments