ఈ పదోన్నతుల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించారు. నిర్ణీత ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతిభ, అర్హతలకు ప్రాధాన్యతనిచ్చారు
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సహకారం, ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం తీసుకున్న చొరవ, నిరంతర కృషి ఫలితంగానే ఈ దీర్ఘకాలిక అంశానికి సానుకూల పరిష్కారం లభించింది. ఉద్యోగుల సంక్షేమం, కెరీర్ పురోగతి పట్ల యాజమాన్యం చూపిన చొరవకు ఇది నిదర్శనంగా నిలిచింది.ఈ పదోన్నతులు ముఖ్యంగా యువ ఎగ్జిక్యూటివ్‌లలో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, సంస్థలో అనుభవజ్ఞులైన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సేవలు, అనుభవానికి కూడా గుర్తింపును అందించాయి. మొత్తంగా ఆర్‌ఐఎన్‌ఎల్ కార్యశక్తిని మరింత బలోపేతం చేసి, సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ఈ పదోన్నతులు దోహదపడనున్నాయి.
పదోన్నతులు పొందిన పలువురు యువ, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హర్షం వ్యక్తం చేస్తూ, తమ దీర్ఘకాలిక కెరీర్ పురోగతిపై శ్రద్ధ చూపి, ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు, ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం, నిబద్ధత, బాధ్యతాభావం పెంపొందిందని, సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషిని మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇది ప్రేరణగా నిలిచిందని వారు పేర్కొన్నారు.“ఉద్యోగుల ఉత్సాహమే సంస్థకు బలం” అన్న స్ఫూర్తితో, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, ఉత్పాదకత, సామర్థ్యం, నాణ్యతతో ఆర్‌ఐఎన్‌ఎల్‌ను మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పదోన్నతులు కొత్త ప్రేరణగా నిలిచాయి.





0 Comments