విశాఖపట్నం :ఎం వి పి కాలనీ లోని శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం లో దసరా పాంచరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణిగా అమ్మ వారిని పూజించారు. భక్తిశ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీ ఆరాధన – పంచామృతాభిషేకం, లక్ష్మీ సహస్రనామార్చన, కుంకుమార్చన లో అనేక మంది మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.
కార్యక్రమం గణేశ పూజ, పుణ్యాహవాచనంతో ప్రారంభమై, అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో కూడిన పంచామృతాలతో భక్తిశ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు. పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని సుందరంగా అలంకరించారు.
అనంతరం లక్ష్మీ సహస్రనామ పారాయణంతో అమ్మవారికి అర్చన, తదుపరి అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన నిర్వహించారు. నీరాజనం సమర్పించి, మహానైవేద్యం సమర్పించారు.తదుపరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి అర్చన, హారతి నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు.
సాయంత్రం నామస్మరణ, జప పారాయణం అనంతరం భక్తులచే భక్తి భజనలు నిర్వహించబడ్డాయి. మహాహారతి అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది.పూజా కార్యక్రమాన్ని విశాఖ జిల్లా మహిళా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీమతి రాధా సత్యవరపు , పండితులు శ్రీ భాస్కర శర్మ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ యెన్ నాయుడు, రాష్ట్ర వేదం(మహిళా ) ఇంచార్జి శ్రీమతి శ్రీదేవి, సిటీ సేవా సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ , ఇతర పదాధికారులు, అనేక మంది భక్తులు భక్తితో పాల్గొన్నారుమహాలక్ష్మీ స్వరూపిణిగా అమ్మవారి దివ్య దర్శనం, పూజా కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను, భక్తిశ్రద్ధలను మరింత పెంపొందించాయి.




0 Comments