కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు, యల్.ఇ.డి ట్యూబ్ లైట్లు బహూకరణ...

 

           SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం....మండలంలోని   కొమరగిరిపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ కొమరగిరిపట్నం వారిచే మూడు సీలింగ్ ఫ్యాన్లు మరియు 6 యల్.ఇ.డి.ట్యూబ్ లైట్లును పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సాల సత్యనారాయణ  సమక్షంలో బహూకరించారు.ఇటీవల ప్రధానోపాధ్యాయులు కాకినాడ చేయూత స్వచ్ఛంద సంస్థచే అవార్డును మరియు అక్టోబర్ 2 న కలెక్టరేట్ లో కలెక్టర్  ద్వారా సాస్ అవార్డును పొందిన సందర్భంగా  సత్యనారాయణను  రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మోసుగంటి గంగయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారిచే సన్మానించారు

. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సాల సత్యనారాయణ, ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు చిట్టుమేను వేంకటేశ్వరరావు, మోసుగంటి వెంకటేశ్వరరావు, రుద్రరాజు రమేష్ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి,శివజ్యోతి, అడబాల శ్రీనివాస్,ఎ.సుబ్రహ్మాణ్యం,వై.ప్రభాకర్, సతీష్, విజయకుమార్,మణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments