సేవే సాధనగా… రక్తదానమే మానవతా సందేశంగా – విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం శ్రీ కర్రి శ్రీనివాస్ సేవా స్ఫూర్తి-59వ సారి అరుదైన O నెగెటివ్ రక్తదానం… ఆపదలో ఉన్న ప్రాణానికి ఆపన్నహస్తం!


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పట్ల అచంచలమైన భక్తి కలిగిన శ్రీ కర్రి శ్రీనివాస్ మరోసారి తన మానవతా సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక రోగికి తన అరుదైన O నెగెటివ్ రక్తాన్ని 59వ సారి విజయవంతంగా దానం చేసి, సమయానికి ఆపన్నహస్తం అందించారు. 

షీలానగర్‌లోని KIMS ఆసుపత్రిలో ఈ రక్తదానం చేశారు.విజయనగరం జిల్లాకు చెందిన 49 ఏళ్ల మహిళ శ్రీమతి Md. Khammar, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ, తీవ్ర రక్తహీనతతో హెమోగ్లోబిన్ స్థాయి 5.4గా ఉండటంతో అత్యవసరంగా రక్తం అవసరమైంది.

ఈ విషయాన్ని ఒక యాప్ ద్వారా తెలుసుకున్న శ్రీ కర్రి శ్రీనివాస్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకుని తన O-ve నెగెటివ్ రక్తాన్ని దానం చేసి రోగికి సమయానుకూలంగా సహాయం అందించారు.

రక్తదానం చేయడం పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది మరో నిదర్శనం. అవసరమైన సందర్భాల్లో తన రక్తాన్ని దానం చేయడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటూ, స్వచ్ఛంద రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడటమే నిజమైన మానవ సేవ అనే సందేశాన్ని తన ఆచరణ ద్వారా చాటుతున్నారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన “Love All, Serve All” మరియు “Help Ever, Hurt Never” స్ఫూర్తితో శ్రీ కర్రి శ్రీనివాస్ చేస్తున్న ఈ నిరంతర రక్తదాన సేవ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

శ్రీ సత్యసాయి సేవా సమితి, ఉక్కునగరం ఆయన సేవా స్ఫూర్తిని అభినందిస్తూ, శ్రీ కర్రి శ్రీనివాస్ గారి వంటి సేవాభావం కలిగిన వ్యక్తులు సమాజానికి నిజమైన ఆదర్శమని పేర్కొంది.

ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, రక్తదానం వంటి మహోన్నత సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న శ్రీ కర్రి శ్రీనివాస్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించి, మరెన్నో సంవత్సరాలు అవసరంలో ఉన్న వారికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రార్థించింది.

ఒక్క రక్తదానం… ఒక ప్రాణానికి ఆశాకిరణం!

సేవలోనే సాయి… సేవలోనే మానవత్వం!

Post a Comment

0 Comments