విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని:ఎం వి పి కాలనీ లోని శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం లో దసరా పాంచరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ దుర్గా దేవిగా, శ్రీ అన్నపూర్ణ గా అమ్మ వారిని ఆవాహనం చేసి భక్తులు పూజించారు. భక్తిశ్రద్ధలతో శ్రీ దుర్గా దేవికి సహస్ర నామార్చన , శ్రీ అన్నపూర్ణా దేవికి అష్టోత్తరం, నవ దినుసులతో పూజ, అన్నాభిషేకం, నీరాజన మంత్రం పుష్పాలతో భక్తులు ఆరాధించారు .ఈ పూజల్లో అనేక మంది మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాన్ని విశాఖ జిల్లా మహిళా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీమతి రాధా సత్యవరపు , పండితులు శ్రీ భాస్కర శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ యెన్ నాయుడు, వేద పండితులు శ్రీ సుబ్రహ్మణ్యం సిటీ సేవా సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ , ఇతర పదాధికారులు, అనేక మంది భక్తులు భక్తితో పాల్గొన్నారు.
0 Comments