విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని: శంకర మఠంశనివారం :విశాఖలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో సుమారు నాలుగువందల మంది బ్రాహ్మణులు పాల్గొని తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. నగరంలోని పలు వార్డుల్లో బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని
కాబట్టి బ్రాహ్మణ అభ్యర్థులకు కార్పొరేటర్ టిక్కెట్లు కేటాయిస్తే స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు బ్రాహ్మణ సామాజికవర్గ సంక్షేమానికి తోడ్పడుతుందని పెద్దలు
అభిప్రాయపడ్డారు.నగరంలోని బ్రాహ్మణ సామజిక వర్గమంతా ఐక్యంగా పోరాడి అర్హులైన,ఆసక్తిగల బ్రాహ్మణ అభ్యర్థులకు కార్పొరేటర్ సీట్లు కేటాయించేలా ప్రధాన పార్టీల అధిష్టానాల దృష్టికి తీసుకెళ్ళాలని ప్రాధమికంగా నిర్ణయించారు.ఈ ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణ ప్రముఖులు చెరువు రామకోటయ్య, సుహాసిని ఆనంద్, కేశాప్రగడ నరసింహమూర్తి,గాడేపల్లి ప్రభాకర శాస్త్రి,ముళ్ళపూడి కోటేశ్వర రావు,రాచకొండ దశరధరామయ్య,వీవీ గిరి,నేరెళ్ల కామేశ్వర శర్మ,సోమయాజుల విజయ్ కుమార్ శర్మ,నూకల సూర్యప్రకాష్,నెమ్మలూరి గణేష్,గంటి రవికుమార్ తదితరులతో పాటు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలనే ఆసక్తిగల అభ్యర్థులు,నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు
0 Comments