జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం :ఈరోజు అనగా తేదీ 03.10.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు ఈరోజు కె.జి.హెచ్ లో నిర్వహించిన సేవా సంకల్ప

 వైద్య శిబిరం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం, లెప్రసీ మరియు క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రాం, ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రాం, హై రిస్క్ ప్రేగ్నన్సీ, మలేరియా, డెంగ్యూ వంటి ఇతర ప్రోగ్రాం ల అధికారులు వారి యొక్క స్టాల్స్ ను ప్రదర్శించారు. ఈ స్టాల్స్ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య పధకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు స్టాల్స్ నందు ప్రజలకు వైద్య సేవలందించారు. 


ఈ స్టాల్స్ ను గౌరవ శాసన సభ్యులు శ్రీ పి.విష్ణు కుమార్ రాజు వారు, శ్రీ గంటా శ్రీనివాస రావు వారు సందర్శించారు. గౌరవ శాసన సభ్యులు శ్రీ పి.విష్ణు కుమార్ రాజు వారు ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పి.ఎం.జె.వై., అయుష్, మహిళా సంరక్షణ వాక్సినేషన్ పధకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తదుపరి శ్రీ పి.విష్ణు కుమార్ రాజు వారు అధిక రక్తపోటు పరీక్ష చేయించుకున్నారు. అదేవిధంగా ప్రజలందరూ ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని, ఈ ఉచిత వైద్య శిభిరం యొక్క లక్ష్యంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాస రావు వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డా.ఐ.వాణి, కె.జి.హెచ్. సూపరింటెండెంట్, డా.శ్రీ ఆర్.నరేంద్ర సింగ్, డి.సి.హెచ్.ఎస్. శ్రీ బి.వి.రమణ, అడ్మినిస్ట్రేటర్ & డిప్యూటీ కలెక్టర్, కె.జి.హెచ్. డా.ఆర్.రమేష్, డి.ఎల్.ఎ.టి.ఒ., డా,లూసీ, డి.ఐ.ఒ., డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ., డా.బి.హారిక, జిల్లా అరి.బి.ఎస్.కె.సమన్వయకర్త, డా.కె.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త,

డా.బి.కిరణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేషన్, డా.పద్మావతి, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1, డా.ప్రదీప్ రాజా, డి.ఎస్.ఒ, శ్రీ జి.శశి భూషణ్, డి.పి.ఒ. శ్రీ బి.నాగభూషణం, ఎ.పి.ఎం.ఒ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.            

            జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

     విశాఖపట్నం

Post a Comment

0 Comments