అంతర్జాతీయ విద్యా సహకారానికి GVPIHLR-DTU–బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం


విశాఖపట్నం: అక్టోబర్ 3:విశాఖపట్నంలోని గాయత్రీ విద్యా పరిషత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ – డీమ్డ్ టు బీ యూనివర్సిటీ (GVPIHLR-DTU), అమెరికాలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ (BGSU) మధ్య అంతర్జాతీయ విద్యా సహకారాన్ని బలోపేతం చేసేందుకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, సంయుక్త పరిశోధనలు, పరిశోధనా ప్రచురణలు, సదస్సులు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, ఆవిష్కరణలు, సంయుక్త ప్రాజెక్టులు, పరిశ్రమ–విద్యాసంస్థల అనుసంధానం వంటి కార్యక్రమాలకు అవకాశాలు ఏర్పడనున్నాయి.

కార్యక్రమంలో GVPIHLR-DTU ఉపకులపతి, GVPIHLR ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ డి. దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ కె.పి.ఆర్. శాస్త్రి, ప్రొఫెసర్ బి. సుబ్బారావు, కార్యదర్శి ప్రొఫెసర్ పి. సోమరాజు, కోశాధికారి ప్రొఫెసర్ రాజా గణపతి, ట్రస్ట్ సభ్యులు, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


BGSU తరఫున డాక్టర్ రవి, ప్రొవోస్ట్; డాక్టర్ రామ్ వీరపనేని, వైస్ ప్రొవోస్ట్; డాక్టర్ ట్రేసీ హిడాల్గో, డైరెక్టర్ – ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ & పార్ట్‌నర్‌షిప్స్ పాల్గొన్నారు.ఈ భాగస్వామ్యం అంతర్జాతీయీకరణ, పరిశోధన, ఆవిష్కరణలు, అధ్యాపకుల అభివృద్ధి మరియు విద్యార్థులకు అంతర్జాతీయ విద్యా అనుభవాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని ప్రతినిధులు తెలిపారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య దీర్ఘకాలిక విద్యా సహకారానికి ఈ MoU బలమైన పునాదిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమం అనంతరం T&P సెమినార్ హాల్‌లో నెట్‌వర్కింగ్ లంచ్ నిర్వహించారు.

Post a Comment

0 Comments