సింహాచలం:22 సెప్టెంబర్ 2026.ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం భక్తిప్రపత్తులతో విరాళం సమకూరింది. శ్రీ సింహాద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన దాత శ్రీ పి. నరసింహరాజు రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు) నగదు విరాళాన్ని ప్రోటోకాల్ విభాగంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు దాతలకు అధికారిక అన్నప్రసాద బాండ్‌ను స్వయంగా అందజేశారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో, ఆలయ అధికారులు దాతలకు శేషవస్త్రం తో సత్కరించి, శ్రీ నృసింహుని ప్రసాదాలను అందజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సేవలో పాలుపంచుకున్న దాతల ఔదార్యాన్ని దేవస్థాన అధికారులు ప్రశంసించారు.

0 Comments