. SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం.....మండల పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 23తో పూర్తి కానున్న తరుణంలో మండల అభివృద్ధి అధికారిణి గౌరికుమారి అధ్యక్షతన సోమవారం పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఎంపిపి శేషగిరిరావు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని, పదవులు కోసం రాజకీయాల్లోకి రాకూడదని, ప్రజాసేవే లక్ష్యంగా పాలన అందిస్తే ప్రజల ఎప్పడూ మరచిపోరని, శాశ్వతంగా వారి గుండెల్లోనే ఉంటామని వారికే పట్టం కడతారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకొని పాలన అందించే ఆ మండలం ఎప్పుడూ అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. తూర్పులంక సర్పంచ్ గా , ఎంపీటీసీగా, అల్లవరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా , అల్లవరం ఎంపీపీగా మండల ప్రజలు ఆదరించారని తెలిపారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ ఎంపీ చింతా అనురాధ, ప్రస్తుత ఎమ్మెల్యే ఆనందరావుల సహాయ సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని ఎంపీపీ అన్నారు. పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీపీ శేషగిరిరావు సౌమ్యుడుగా, వివాద రహితుడుగా పార్టీలకు, మతాలకు అతీతంగా సేవలు అందించారని కొనియాడారు. అధికారులను. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఆయన కీలకపాత్రపోషించేవారన్నారు. తొలుత జెడ్పీటీసీ కొనుకు గౌతమి, వైస్ ఎంపీపీలు వడ్డి గంగ, ముత్యాల వెంకట రామకృష్ణ ఎంపీపీ శేషగిరిరావును, ఎంపీటీసీ సభ్యులను శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఎంపీపీ శేషగిరిరావును ఎంపీటీసీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు యల్లమిల్లి బోసు, మండల పార్టీ అధ్యక్షులు కొనుకు బాపూజీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ తిక్కా ప్రసాద్, పీఆర్ డీఈఈలు అన్యం రాంబాబు, రాజ్ కుమార్, తహసిల్దార్ అడపా సుబ్రహ్మణ్యం, సిడిపిఓ రమాదేవి, అయినవిల్లి ఎంపీడీఓ సరోవరరావు, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబురాజు, కంకిపాటి వీరబాబు ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, మండల ప్రజా పరిషత్ సిబ్బంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎంపీపీని సత్కరించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు వారధిగా నిలిచి ప్రజా సమస్యలు పరిష్కరానికి కృషి చేసే పాత్రికేయులను ఎంపీపీ శేషగిరిరావు, ఎంపీడీఓ గౌరీ కుమారి దుస్సాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి నరసింహరావు, సాధనాల వెంకటరావు, తోట శ్రీదేవి నరసింహారావు,రాకాపు విజయలక్ష్మి, బర్రె సితారత్నం, చిట్నిడి శ్రీదేవి, చింతా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



0 Comments