విశాఖపట్నం-సెప్టెంబర్22,2026:విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్‌స్ కాలేజ్ ఫర్ విమెన్ (A) ఆధ్వర్యంలో ఇంటర్‌కాలేజియేట్ అకాడమిక్ ఫెస్ట్ – 2K26ను 2026 అక్టోబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఫెస్ట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఈరోజు గౌరవనీయులైన ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ అకాడమిక్ ఫెస్ట్ వివిధ కళాశాలల విద్యార్థులకు తమ విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సృజనాత్మకత మరియు పోటీ స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఒక మంచి వేదికగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో గణితం & గణాంక శాస్త్ర విభాగాధిపతి డా. క్యాప్టెన్ కె. సుజాత, అధ్యాపకులు డా. సౌజన్య, డా. గౌరి, శ్రీ శ్రీరామ్, శ్రీమతి యోజన, శ్రీమతి లక్ష్మి, Ms. సునీత, శ్రీమతి భారతి మరియు శ్రీమతి జ్యోతి పాల్గొన్నారు. అలాగే II & III B.Sc. Mathematics Major విద్యార్థులు అకాడమిక్ ఫెస్ట్ నిర్వహణలో చురుకుగా భాగస్వామ్యం అవుతున్నారు.ఈ సందర్భంగా ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించి, నిరంతరం ప్రోత్సాహం మరియు సహకారం అందిస్తున్న ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీకి గణితం & గణాంక శాస్త్ర విభాగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
వివిధ కళాశాలల విద్యార్థులు Intercollegiate Academic Fest – 2K26లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గణితం & గణాంక శాస్త్ర విభాగం ఆహ్వానిస్తోంది.గణితం & గణాంక శాస్త్ర విభాగం
సెయింట్ జోసెఫ్‌స్ కాలేజ్ ఫర్ విమెన్ (A), విశాఖపట్నం



0 Comments